తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్లని ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. కొన్ని సార్లు తన పాటలతోనే సినిమాల్ని గట్టెక్కించగలిగాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా సూపర్ హిట్ ట్యూన్లు ఇవ్వడం దేవి ప్రత్యేకత. అందుకే బాలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వస్తుంటాయి. కానీ అదేం విచిత్రమో.. బాలీవుడ్ నుంచి ఛాన్స్ వచ్చిన ప్రతీసారీ.. తన పాత ట్యూన్లనే బయటకు తీస్తుంటాడు. ఈరోజు `రాధే` నుంచి సిటీమార్ అనే పాట విడుదలైంది. ఆ పాట...డీజేలోని సిటీమార్ ట్యూనే. పాటని యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు.
ఇది వరకు కూడా దేవి ఇలానే చేశాడు. ఆకలేస్తే అన్నం పెడతా, రింగరింగ, ఆ అంటే అమలాపురం.. ఇలా తెలుగులో హిట్టయిన బాణీలనే హిందీలోనూ వినిపించాడు. ఇప్పుడూ ఇంతే. దాని వల్ల దేవికి వచ్చే ఉపయోగం ఏమిటో అర్థం కాదు. ఆల్రెడీ వినేసిన పాటల్ని మళ్లీ హిందీలో వింటున్నట్టు ఉంది తప్ప.. కొత్తగా ఏం లేదు. ఆ మాత్రం దానికి బాలీవుడ్ వాళ్లకు ట్యూన్ ఇస్తే, వాళ్లే కాస్త అటే ఇటుగా కొట్టేస్తారు కదా..? సిటీమార్ పాటకు సంబంధించిన వీడియో కూడా చిత్రబృందం విడుదల చేసింది. అందులో సల్మాన్‌స్టెప్పులు వేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు. ట్యూన్ తో పాటు... ఆఖరికి స్టెప్పులు కూడా కాపీనే. ఇలా.. అన్ని రకాలుగానూ... సిటీమార్ పాట... నిరాశ పరిచింది.