పుష్ప2 మ్యూజిక్ గురించి చాలా చర్చ నడిచింది. ఆఖరి నిమిషంలో ఓ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. దేవిశ్రీపై నమ్మకం కోల్పోయిన సుకుమార్ మరో ముగ్గురిని తీసుకొచ్చి ఈ సినిమా బీజీఎం ని రెడీ చేయిస్తున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ వాస్తవం అది కాదు. అసలు సమస్య సుకుమార్ దేవిశ్రీ మధ్య కాదని, నిర్మాతలు దేవి వర్క్ స్పీడ్ పై కాస్త అసంతృప్తిగా ఉన్నారని, వర్క్ ఫాస్ట్ గా జరిపించాలనే ఉద్దేశంశంతోనే సుకుమార్ మరో దారిలేక మిగతా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారని అసలు సంగతి తెలిసిన వారు ముందే చెప్పారు.
నిన్న పుష్ప ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ స్పీచ్ తో ఇదంతా క్లియర్ అయ్యింది. అసలు సమస్య సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ మధ్య కాదు. పుష్పకి దేవిశ్రీ యాడ్ చేసిన వాల్యూ సుకుమార్ కి తెలుసు. ఇంకాస్త టైం ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ తీసుకోవచ్చనే ఆలోచనలో కూడా సుకుమార్ లో వుంది. కానీ నిర్మాతల ఒత్తిడిని కూడా గమనించాలి. నిర్మాతల రిలీఫ్ కోసమే సుకుమార్ మిగతా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ప్రాజెక్టు లోకి పట్టుకొచ్చారని నిన్నటి దేవిశ్రీప్రసాద్ స్పీచ్ తో క్లియర్ అయ్యింది.
ఇక ఈ సినిమా ఫైనల్ అవుట్ లో కూడా దేవిశ్రీప్రసాద్ బీజీఎం వుండే ఛాన్స్ వుంది. ఒకవేళ మిగతా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలంటే థాంక్స్ కార్డ్ లోనే పడుతుంది. పుష్ప2 దేవి - సుకుమార్ మధ్య గ్యాప్ తెచ్చిందనే మాట అవాస్తవం. సుకుమార్ చేయబోయే కొత్త సినిమాలో కూడా దేవిశ్రీప్రసాద్ తోనే పని చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే.. సుకుమార్ - దేవిశ్రీ కాంబినేషన్ అటువంటిది.