రామ్ చరణ్ తో సాయి పల్లవి?

మరిన్ని వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒక వైపు జనవరి 10 న రిలీజ్ కానున్న 'గేమ్ చేంజెర్' ప్రమోషన్స్. ఇంకో వైపు RC16 షూటింగ్ షెడ్యూల్. గేమ్ చేంజెర్ సినిమా కోసం చరణ్ బాగా లాక్ అయిపోయాడు. RRR  తరవాత కేవలం గేమ్ చేంజెర్ కోసం మూడేళ్లు కేటాయించాడు. తన తోటి హీరోలకంటే చెర్రీ వెనకపడిపోయాడు. మెగా ఫాన్స్ అసహనంగా ఉన్నారు. దీనితో చెర్రీ కూడా ఇప్పడు వరుస ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఒక వైపు బుచ్చి బాబుతో  RC16 చేస్తూనే మిగతా కథలు కూడా వింటున్నాడని సమాచారం.

RC16 తరవాత సుకుమార్ తో ఒక మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు చెర్రీ. ఇది RC17 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2 ముగింపు కార్యక్రమాలు, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఫ్రీ అయ్యాక చెర్రీ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అవన్నీ అయ్యేసరికి చెర్రీ బుచ్చి బాబు మూవీ కంప్లీట్ అవుతుంది. అయితే ప్రజంట్ చెర్రీ గ్లోబల్ స్టార్ అయిపోవటంతో తనతో నటించే హీరోయిన్స్ పై కూడా అంతే శ్రద్ద తీసుకుంటున్నారు మేకర్స్. RRR లో అలియా భట్, గేమ్ చేంజెర్ లో కియారా అద్వానీ, RC16 లో జాన్వీ కపూర్ ఇలా అంతా బాలీవుడ్ భామలు చెర్రీతో నటిస్తున్నారు. దీనితో ఆర్సీ 17 లో హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలో పెరిగింది. సుకుమార్ కూడా హీరోయిన్స్ విషయంలో పక్కాగా ఉంటాడు. ఈ సారి చెర్రీ కోసం ఏ హీరోయిన్ ని దించుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు వినిపిస్తోంది.

చెర్రీ క్రేజ్ కి కటౌట్ కి సాయి పల్లవి కూడా తోడయితే ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది అని సుక్కు భావిస్తున్నారట. చెర్రీ, సాయి పల్లవి పెయిర్ చాలా బాగుంటుందని, డాన్స్ లో కూడా ఇద్దరి ఎవర్ గ్రీన్ అని ఫాన్స్ ఆశ పడుతున్నారు. పైగా సుక్కు కథకి సాయి ప‌ల్ల‌వి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అని టాక్. రీసెంట్ గా అమరన్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సాయి పల్లవి, నెక్స్ట్ తండేల్ తో పాన్ ఇండియాని పలకరించనుంది. ఇంకో వైపు బాలీవుడ్ లో రణబీర్ తో రామాయణంలో నటిస్తోంది. ఇప్పుడు సుకుమార్ చెర్రీ కాంబోలో నటిస్తే సాయి పల్లవి స్టార్ డం పెరగటం గ్యారంటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS