హిందీలోనూ సరికొత్త 'ప్రస్థానం' రచించేశాడు.!

By iQlikMovies - August 30, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

చేసినవి తక్కువ సినిమాలే అయినా, రచయితగా, దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు దేవకట్టా. ఆయన కెరీర్‌లో ఎవర్‌ గ్రీన్‌ ప్రశంసలు దక్కించుకున్న సినిమా 'ప్రస్థానం'. సాయికుమార్‌, శర్వానంద్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు, క్రిటిక్స్‌ ప్రశంసలు అందుకుంది. ఇనేళ్ల తర్వాత ఈ సినిమా హిందీలో రీమేక్‌ అవుతోంది. ఈ రీమేక్‌కీ దేవకట్టానే దర్శకత్వం వహించడం విశేషం. కథ నచ్చి, ఈ సినిమాలో నటించడానికీ, తానే స్వయంగా నిర్మించడానికీ ముందుకొచ్చాడు స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌. తాజాగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

 

ఈ క్రమంలో లేటెస్ట్‌గా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. అదే టైటిల్‌తో రీమేక్‌ అయిన ఈ హిందీ ప్రస్థానం ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సంజయ్‌ దత్‌తో పాటు, జాకీ ష్రాఫ్‌. అలీ ఫైజల్‌, మనీషా కోయిరాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో మంచి విజయం సాధించిన 'ప్రస్థానం' హిందీలోనూ పోజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటే హిందీలోనూ దేవకట్టా సరికొత్త ప్రస్థానం లిఖించినట్లే. మరోవైపు ఈ సినిమాని ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS