'బాహుబలి' తర్వాత ఆ రేంజ్‌లో ప్రబాస్ నుండి వస్తున్న విజువల్ వండర్ 'సాహో' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం 'సాహో' టీమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. రెండేళ్ల కఠోర శ్రమ. భారీ బడ్జెట్.. విపరీతమైన ఒత్తిడి.. ఇలా ఒక్కటేమిటి. వాటన్నింటికీ ఫలితం దక్కే రోజు ఈ రోజే. ఇప్పటికే ప్రీమియర్స్ నుండి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం 'సాహో'కి మంచి టాక్ వస్తోంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ అయితే, చెప్పినట్లుగానే న భూతో న భవిష్యతి అనేలానే ఉన్నాయట.
ఖర్చు అంతా స్క్రీన్‌పై సుస్పష్టంగా కనిపిస్తోందట. విజువల్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయని అంటున్నారు. ఇక ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది అప్పుడే చెప్పలేం. కానీ, ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఫ్యాన్స్‌తో పాటు, సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా 'సాహో'కి ఆల్ ది వెరీ బెస్ట్ చెబుతున్నారు. ఇక 'సాహో' కోసం తన సినిమా రిలీజ్ డేట్‌ని త్యాగం చేసిన 'గ్యాంగ్ లీడర్' నాని 'ప్రబాస్ అన్నకు, సుజిత్‌కి, మిగిలిన సాహో టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సిల్వర్ స్క్రీన్‌ని మంట పెట్టేయండి. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న కారణంగా సినిమాని మిస్ అవుతున్నా.. ఇండియాకి తిరిగి రాగానే చూస్తా.. అని నాని ట్వీట్ చేశాడు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్ తదితర సెలబ్రిటీలు 'సాహో' బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తూ, ట్వీట్స్ చేశారు.