పోస్టర్ల తోనే వివాదాస్పదమైన ద్యావుడా చిత్రం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే, శివలింగాన్ని అవమానపరిచేలా పోస్టర్లు విడుదల చేసినందుకుగాను దర్శకుడు సాయిరాంని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసును పరిశీలించిన తరువాత కోర్టు దర్శకుడికి రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత హరికుమార్ రెడ్డి మాత్రం పరారీలో ఉన్నట్టు సమాచారం. పోస్టర్లు రిలీజ్ అయిన వెంటనే పెద్ద దుమారమే చెలరేగింది. వెంటనే దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పినా ఫలితం లేకపోయింది. ఇక ఈ చిత్రం మరుగునపడిపోయినట్టే అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా దేవుళ్ళ మీద సినిమాలు తీస్తున్నవారు తీయాలనుకునేవారు జాగ్రత్త పడితే మంచిది అనే ఉచిత సలహాలు కూడా మరింత జోరందుకున్నాయి.