'ఖైదీ నెంబర్ 150' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి అనుమతి లభించలేదు. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా సమస్యలు తలెత్తాయి. బెనిఫిట్ షోల పరంగా కూడా సమస్యలను ఎదుర్కొంది 'ఖైదీ'. ఈ ఇబ్బందులను వినాయక్ పరోక్షంగా ప్రస్తావించాడు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సినిమాకి మాత్రం బీభత్సమైన రెస్పాన్స్ వచ్చినందుకు వినాయక్ అంతులేని ఆనందంలో ఉన్నాడు. అలాగే అన్నయ్య అభిమానులు, తమ అభిమాన హీరో సినిమాకి కొన్ని చోట్ల ఎదురవుతున్న సమస్యల పట్ల ఆవేదన చెందిన మాట వాస్తవం. ఏ హీరో సినిమాకీ ఇన్ని ఇబ్బందులు రాలేదు. అలాంటిది మెగాస్టార్ రీ ఎంట్రీలో వస్తోన్న 'ఖైదీ' సినిమాకి ఎదురయిన సమస్యల్ని తలచుకుంటూ చాలా బాధాకరం. అయితే ఈ బాధలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయాయి. సినిమా సంచలన విజయం సాధించింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా చిత్ర యూనిట్ అంతా ఒకే నమ్మకం మీద ఉన్నారు. విడుదలకి ముందు ఎన్ని అవాంతరాలొచ్చి పడినా, సినిమాకి రావాల్సిన వసూళ్ళు వచ్చి తీరతాయని డైరెక్ట్‌గా వినాయకే చెప్పాడు. వారి నమ్మకాన్ని సినిమా ఏ మాత్రం వమ్ము చేయలేదు. 'ఖైదీ' తొలి వారంలోనే 100 కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. దీంతో చిత్ర యూనిట్ గర్వంగా ఫీలయ్యింది. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకి సంబంధించిన లెక్కల వివరాలను డీటెయిల్డ్‌గా, డైరెక్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జనానికి తెలియజేశారు.