ఈమధ్య ఓ సినిమా తెచ్చుకొన్న టాక్ కీ.. సంపాదించిన వసూళ్లకూ పొంతన ఉండడం లేదు. `బాగుంది` అనే టాక్ వచ్చినా... కొన్ని సినిమాలు కలక్షన్లు సాధించలేకపోయాయి.
`ధమాకా` విషయంలో ఇది రివర్స్ అవుతోందేమో అనిపిస్తోంది. రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. శ్రీలీల కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. తొలి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది. రొటీన్ సినిమా అంటూ రివ్యూలు తేల్చేశాయి. అయితే ఈ సినిమాకి మంచి వసూళ్లే వచ్చాయి. 4 రోజుల్లో ఈ సినిమాకి రూ.41 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. శుక్ర, శనివారాలు ఓ మోస్తరుగా కలక్షన్లు ఉన్నా, ఆదివారం పుంజుకొన్నాయని సమాచారం. రవితేజ నుంచి ఈ యేడాది వచ్చిన మూడో సినిమా ఇది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలకు కూడా ఇలానే ఫ్లాపు టాకు వచ్చింది. ఫ్లాప్ అని తెలిశాక.. వసూళ్లు ఢమాల్ మని పడిపోయాయి. కానీ `ధమాకా` విషయంలో రివర్స్ అయ్యింది. ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగున్నాయి.
ఓరకంగా రవితేజకు ఇది ఉపశమనం కలిగించే విషయమే. సాధారణంగా ఏ సినమాకైనా సోమవారం వసూళ్లు తగ్గిపోతాయి. కానీ `ధమాకా` నిలకడగా వసూళ్లు సాధించడం విశేషం.