సినిమా స్టార్లు... రాజకీయాల్లోకి రావడం మామూలే. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలూ, కమెడియన్లు... ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేయాలని చూశారు. ఈ సంప్రదాయం మన కంటే తమిళనాట ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ హీరోయిన్లకు ఇంకాస్త గ్లామర్ ఉంటుంది. కొంతమంది కథానాయికలు తమిళనాట రాజకీయాలను శాశించారు కూడా. ఇప్పుడు అక్కడ అందరి దృష్టీ త్రిషపై పడింది. త్రిష రాజకీయాల్లోకి రాబోతోందని, ఓ పార్టీ తనకు పదవి కూడా ఆఫర్ చేసిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తాను ఎం.ఎల్.ఏగా నిలబడడం ఖాయమని కూడా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో త్రిష చేయబోతోందని న్యూస్ తమిళనాట సంచలనంగా మారింది.
దీనిపై త్రిష స్పందించింది. తనకు రాజకీయాలు తెలీయవని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే లేదని, కావాలని కొంతమంది ఇలాంటి వార్తల్ని పుట్టిస్తున్నారని తెగేసి చెప్పేసింది. సినిమా పరంగా తను బిజీగా ఉన్నానని, తన మనసులో ఎలాంటి ఆలోచనలూ లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా చేస్తోంది త్రిష. అజిత్ కొత్త సినిమాకి కూడా సంతకం చేసిందని సమాచారం.