సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాంటిది ఆయన సినిమా రంగంలో నెలకొల్పిన రికార్డుని స్వయాన ఆయన అల్లుడైన ధనుష్ బద్దలుకొట్టాడు.
వివరాల్లోకి వెళితే, ధనుష్ నటించిన VIP2 చిత్రం ఆగష్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈచిత్రం మలేషియాలో కూడా భారీ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఆ దేశంలో ఇప్పటివరకు ఎక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన చిత్రంగా రజినీకాంత్ కబాలి చిత్రం పేరిట రికార్డు ఉంది.
ఇక ఈ రికార్డుని ధనుష్ VIP2 చిత్రం అధిగమించనుంది. మొత్తం 550 స్క్రీన్స్ లో విడుదల కానున్న ఈ చిత్రం పై అంచనాలు భారీస్థాయిలోనే ఉన్నాయి.
మరి కలెక్షన్స్ పరంగా కూడా ఈ అల్లుడు తన మామని దాటేస్తాడో లేదో చూడాలి.