లెజెండరీ నటుడు అయిన దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
అయితే నిన్నటి వరకు ఆయన ఆరోగ్యం గురించి అందరు ఆందోళనచెందారు. ఆసుపత్రి వర్గాలు సైతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలియచేశారు. కాని ఇప్పుడు తెలియవస్తున్న వార్తల ప్రకారం, ఆయన ఆరోగ్య నిన్నటితో పోలిస్తే మెరుగుపడిందని, ఆయనంతట ఆయనే శ్వాస తీసుకుంటున్నారు అని డాక్టర్లు చెబుతున్నారు.
దీనితో ఆయన కుటుంబసభ్యులకి, అభిమానులకి కాస్త ఊరట లభించింది. అయితే మరిన్ని పరీక్షల నిమిత్తం ఆయనని ICUలోనే మరో మూడురోజులు ఉంచబోతున్నట్టు ఆసుపత్రి వర్గాల సమాచారం.