తమిళంలో ప్రముఖ నటుడు ధనుష్. గత కొన్నాళ్లుగా ధనుష్ పలు ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. హీరో ధనుష్ తన బిడ్డేనంటూ కదరీశన్, మీనాక్షి అనే వృద్ద దంపతులు పలు ఆధారాలను మీడియా ముందుంచారు. తమకు న్యాయం జరగాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇంతవరకూ అంతా అనుకూలంగానే అనిపించిన కదిరీశన్, మీనాక్షి దంపతులకు న్యాయ స్థానంలో చుక్కెదురయ్యింది. వృద్ధ దంపతులైన కదిరీశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడేనని నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. వృద్ధాప్యంలో వారికి ఈ కష్టం అవసరమా? అని అందరూ అనుకున్నారు. చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ వారు చేసినప్పటికీ, న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు. అందుకు తగిన ఆధారాలు సమర్పించడంలో పాపం ఈ వృద్ధ దంపతులు విఫలమయ్యారట. పుట్టుమచ్చల వరకూ వివాదం నడిచింది. డీఎన్‌ఏ పరీక్ష జరుగుతుందన్న సమయంలో ఈ కేసు ఇలా కొట్టివేయబడింది. న్యాయస్థానం కదిరీశన్, మీనాక్షి దంపతులు వేసిన పిటిషన్‌ని కొట్టివేసింది. అయితే ఈ కేసులో ధనుష్ పూర్తిగా ఊరట పొందినట్లు కాదు. పై కోర్టులో సవాల్ చేసేందుకు ఇంకా కదిరీశన్, మీనాక్షి దంపతులకు అవకాశం ఉంది. పుట్టుమచ్చల్ని చెరిపేసుకోవడంపై ధనుష్ వివరణ ఇంకా తెలియాల్సి ఉంది. ఏమో చూద్దాం పై కోర్టులో అయినా ఆ దంపతులకు న్యాయం జరుగుతుందో? లేదో చూడాలిక.