కుబేర నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్

మరిన్ని వార్తలు

హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ శేఖర్ కమ్ముల కుబేర నుంచి ధనుష్ రష్మిక మందన బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ -శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్స్- జూన్ 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్


సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమా నుంచి సరికొత్త పోస్టర్ ను  మేకర్స్ రిలీజ్ చేశారు. ధనుష్ రష్మిక మందన చిరునవ్వులతో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.


ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ పోయిరా మామ చార్ట్ బస్టర్ హిట్ అయింది. మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.‘పోయిరా మామా’ సాంగ్ తో కుబేర మీద ఉన్న హైప్  నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.


క్యారెక్టర్ బేస్డ్ నరేటివ్స్ తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.


శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.


కుబేర జూన్ 20, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ,మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS