రాయ‌న్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: రాయన్‌
దర్శకత్వం: ధనుష్ 


నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, SJ సూర్య, ప్రకాష్ రాజ్, జయరామ్, దుషారా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు 


నిర్మాత: కళా నిధి మారన్  
ఎడిటర్ : ప్రసన్న GK  
సినిమాటోగ్రాఫర్ : ఓం ప్రకాష్ .
మ్యూజిక్ : AR రెహమాన్  


బ్యానర్స్: సన్ పిక్చర్స్ 
విడుదల తేదీ: 26 జూలై 2024

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5  

 

కోలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టి తన నటనతో అన్ని ఇండస్ట్రీలకూ దగ్గర వాడయ్యాడు ధనుష్. ప్రయోగాలు చేసే హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. మూస ధోరణికి స్వస్తి చెప్పి వైవిధ్యమైన కథలని ఎంచుకొని భాషలకి అతీతంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం ధనుష్ ని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకున్న దర్శకులు కూడా ఉన్నారనటంలో అతిశయోక్తికాదు. నార్త్ ఆడియన్స్ ని కూడా తన నటనతో మెప్పించి సోలో హీరోగా నటించి సక్సెస్ అయ్యాడు. తన కెరియర్ లో 50 వ సినిమాని తెరకెక్కించే ఛాన్స్ ఎవరికీ ఇవ్వకుండా తానే స్వయంగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ధనుష్ డైరక్షన్ లో వచ్చిన ‘రాయన్ ' మూవీ ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాయన్ ఎలా ఉంది. ధనుష్ 50 సినిమా హిట్ అయ్యిందా లేదా? దర్శకుడిగా ధనుష్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.  


కథ:

కార్తవ రాయన్(ధనుష్) తన తమ్ముళ్లు ముత్తువేల్ రాయన్(సందీప్ కిషన్), మాణిక్యం రాయన్(కాళిదాస్ జయరామ్) తన చెల్లి దుర్గ(దుషారా విజయన్) ల చిన్నప్పుడు వారిని ఇంట్లో ఉంచి బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన తల్లితండ్రులు తిరిగిరారు. దాంతో అమ్మా నాన్న ఏమయ్యారో తెలియక వారికోసం వెతుక్కుంటూ ఊర్లో తెలిసిన వ్యక్తిని సాయం అడగ్గా, అతను తన చెల్లి దుర్గని అమ్మే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాయన్ అతన్ని చంపేసి తమ్ముళ్లు చెల్లిని తీసుకుని ఆ ఊరు నుంచి దూరంగా పారిపోతాడు. ఓ మార్కెట్లో శేఖర్(సెల్వ రాఘవన్) వీళ్లకు ఆసరా ఇస్తాడు. పెద్దయ్యాక రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉంటాడు. చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి వెళ్లి చదువుకుంటాడు. ముత్తువేల్ పని పాటా లేకుండా గొడవల్లో తలదూరుస్తూ గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. రాయన్ తన చెల్లి, తమ్ముళ్ళ జోలికి, ఎవరు వచ్చినా ఊరుకోడు. అదే ఊళ్ళో ఉంటున్న దొరై(శరవణన్), సీతారాం(SJ సూర్య)లు రెండు వేరు వేరు గ్యాంగ్ లు. ఆ రౌడీ గ్యాంగ్ ల్ని అంతం చేయడానికి ఆ ఊరికి పోలీసాఫీసర్(ప్రకాష్ రాజ్) వస్తాడు. అనూహ్య పరిణామాల మధ్య దొరై చనిపోతాడు. తరవాత సీతారాం రాయన్ ని చంపించడానికి ట్రై చేస్తాడు. అసలు రాయన్ ని సీతారాం ఎందుకు చంపాలి అనుకుంటాడు? దొరైని ఎవరు చంపారు? పోలీసాఫీసర్ ఏం చేసాడు? రాయన్ చెల్లి కోసం ఏం చేసాడు? తమ్ముళ్లు ఇద్దరికి ఏం జరిగింది అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.  


విశ్లేషణ:

ధనుష్ తన 50వ సినిమాకి తానే దర్శకత్వం వహించి రిస్క్ చేసాడనే చెప్పాలి. దర్శకుడిగా ధనుష్ చేసిన ప్రయత్నం అభినందించ దగినదే.  సినిమా ప్రారంభమే బోరింగ్ గా ఉంటుంది. మధ్యలో కొంచెం అటెక్షన్ క్రియేట్ చేసినా, ఇంతలోనే ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ ని ధనుష్ డైరెక్టర్ గా బాగా ప్రజంట్ చేసాడు. సెకండ్ ఆఫ్ బాగుంది. మొదట చూపించిన స్టోరీని చివరిలో ఇంటర్ లింక్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే బాగుంది. ధనుష్ కి దర్శకునిగా అనుభవం లేని సంగతి అక్కడక్కడా ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. ప్రతి సీన్ ని ఎలా రాసుకున్నాడో అలా ప్రజంట్ చేసే ప్రయత్నం మెచ్చుకోదగిన విషయమే. టోటల్ గా ధనుష్ నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేసి ఓకే అనిపించుకున్నాడు. నటుడిగా ధనుష్ పర్ఫామెన్స్ సూపర్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ కూడా అవసరానికి మించి ఉన్నాయి.   

కథ పరంగా చూస్తే రొటీన్ కథనే కొత్తగా చెప్పటానికి ట్రై చేసాడు. టాలీవుడ్ లో వచ్చిన అన్నయ్య, హిట్లర్ సినిమా తరహాలోనే ఈ కథ ఉందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా రాయన్ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ముత్తువేల్ ప్రేమ కథ, దొరై – సీతారాం గొడవలు చూపించారు. ఇంటర్వెల్ ముందు దొరై మరణంతో ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచారు.అక్కడనుంచి సీతారాం కథ, రాయన్ చెల్లి పెళ్లి, రాయన్ తమ్ముళ్ల కథ, రాయన్ తన చెల్లిని ఎలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకున్నాడు, రాయన్ కి ఏమైంది అన్నది సినిమా మొత్తం.   


నటీ నటులు :

నటీనటుల విషయానికి వస్తే ధనుష్ అద్భుతంగా నటించి మెప్పించాడు. ధనుష్ తన నటనతో విశ్వరూపం చూపించాడు. కొన్ని సీన్లలో ధనుష్ పర్ఫామెన్స్ మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది. ధనుష్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. ఈ సినిమాలో సైలెంట్ గా ఉంటూనే యాక్షన్ సీన్స్ లో తన మార్క్ మ్యానరిజం చూపించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేశాడు. అచ్చం తమిళ హీరోలా తన పాత్రలో ఒదిగిపోయాడు. సందీప్ కి తమిళం లో మరికొన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశముంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఈ మూవీలో ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. ఆమెకు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం ఆశ్చర్యాన్ని క‌లిగించింది. ధనుష్ చెల్లి పాత్రలో నటించిన దుషారా విజయన్ సెకండ్ హాఫ్ లో మాస్ పర్ఫార్మెన్స్ , యాక్షన్ సీక్వెన్స్ లతో మంచి మార్కులే కొట్టేసింది. అపర్ణ బాలమురళి నవ్విస్తూనే ఎమోషనల్ గా మెప్పించింది. SJ సూర్య, సెల్వ రాఘవన్, శరవణన్, ప్రకాష్ రాజ్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. 


టెక్నికల్ :

ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ తీయడానికి వాడిన లైటింగ్ సూపర్ అని చెప్పాలి. హీరో ఎలివేషన్ షాట్స్ లో కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాకి ఎంత బడ్జెట్ అవసరమో అంతే ఖర్చు చేసినట్లు అనిపిస్తుంది. AR రెహమాన్ అందించిన పాట‌లు రిజిస్ట‌ర్ కావు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం హాంటింగ్ గా ఉంది. ముఖ్యంగా యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో. ర‌న్ టైమ్ కూడా షార్ప్ గా ఉంది.వ‌ 


ప్లస్ పాయింట్స్

ధనుష్
సినిమాటోగ్రఫీ
సంగీతం 


మైనస్ పాయింట్స్

అవసరానికి మించి యాక్షన్ సీన్స్ 
అన్న‌దమ్ముల మ‌ధ్య కాన్ఫ్లిక్ట్

 

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: ద‌ర్శ‌కుడిగా ధ‌నుష్ పాస్‌

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS