తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'వి.ఐ.పి - 2'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. గతంలో వచ్చిన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమాకి రిపోర్ట్స్ ఆశించినంతగా రాలేదు కానీ, ధనుష్ మాత్రం సినిమా సూపర్ హిట్ అంటున్నాడు. అంత నమ్మకంగా ఉన్నాడట ఈ సినిమా విజయంపై ధనుష్. అంతేకాదు 'రఘువరన్ బీటెక్'కి కూడా మొదట్లో డివైడ్ టాకే వచ్చింది. కానీ సినిమా ఘన విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ధనుష్ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఇదో సినిమాలా కాకుండా, ఆ క్యారెక్టర్ జనాల్లోకి అంత బాగా వెళ్లిపోయిందంటున్నాడు. అవును నిజమే రఘువరన్ క్యారెక్టర్‌ని అంతా తమ ఇంట్లో క్యారెక్టర్‌లాగే ఫీలవుతూ ఉంటారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించింది. హీరోయిన్‌గా అమలాపాల్ నటించింది. కాగా ఈ సినిమా ఇంతటితో ఆగదట. 'వి.ఐ.పి - 3' కూడా ఉండబోతోందని అంటున్నాడు ధనుష్. అంతేకాదు ఈ సిరీస్‌లో సినిమాలు అలా వస్తూనే ఉంటాయట. హాలీవుడ్‌లో జేమ్స్ బాండ్ సిరీస్‌లో సినిమాలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అలాగే 'వి.ఐ.పి' సిరీస్‌లో సినిమాలు కూడా అలా వస్తూనే ఉంటాయంటున్నాడు హీరో ధనుష్.