ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ద‌శ‌ర‌థ్‌

By Gowthami - January 24, 2023 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` అనే పేరు ఖ‌రారు చేశారు. `తెరి`చిత్రానికి ఇది రీమేక్‌. ప‌వ‌న్ వ‌రుస‌గా రీమేక్ చిత్రాలే చేస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి రీమేక్ ఎంచుకోవ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి బొత్తిగా న‌చ్చ‌లేదు. దాంతో.. రీమేక్ వ‌ద్దు అంటూ సోషల్ మీడియా సాక్షిగా ప‌వ‌న్‌కి విన్న‌పాలు పంపారు. కానీ.. `తెరి` రీమేక్ ఆగ‌డం లేదు. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే న్యూస్ ఒక‌టి రివీల్ చేశాడు ద‌శ‌ర‌థ్‌. ఈ చిత్రానికి ద‌శ‌ర‌థ్ స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నాడు.

 

ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ సినిమా గురించి మాట్లాడుతూ ``తెరి రీమేక్ అయినా క‌థా ప‌రంగా చాలా మార్పులు చేశాం. ప‌వ‌న్ అభిమానుల‌కు న‌చ్చేలా సీన్లు డిజైన్ చేశాం. ఎక్కడా రీమేక్ సినిమాలా అనిపించ‌దు`` అంటూ స్వీట్ న్యూస్ చెప్పాడు. ప‌వ‌న్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `గ‌బ్బ‌ర్ సింగ్ కూడా రీమేక్ సినిమానే. కాక‌పోతే వ‌ర్జిన‌ల్ సినిమాతో పోలిస్తే రీమేకే బాగుంటుంది. మార్పులు, చేర్పులూ ప‌వ‌న్ అభిమానుల‌కు న‌చ్చేలా ఉంటాయి. తెరిలోనూ హ‌రీష్ ఆ మ్యాజిక్ చేస్తాడ‌న్న‌ది అభిమానుల ధీమా. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS