'ఖైదీ నెంబర్ 150' సినిమా స్టార్టయినప్పుడే ఆ సినిమాలో సునీల్ కోసం ఓ పాత్ర ఉందంటూ వార్తలు వచ్చాయి. అది నిజమే. సినిమాలో ఆలీ పోషించిన పాత్రనే సునీల్ కోసం డిజైన్ చేశారు. అయితే ఆ టైంలో సునీల్ వేరే సినిమా షూటింగ్‌లో ఉండడం వల్ల ఆ మెగా ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. గతంలో చిరంజీవితో కలిసి 'స్టాలిన్' సినిమాలో సునీల్ పోషించిన పాత్రకు ఎంతో వెయిట్ ఉంటుంది. అదో సెంటిమెంట్ సీన్. ఆ సీన్‌లో సునీల్ నటించాడనడం కన్నా జీవించాడు అంటేనే సరిపోతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఇంచుమించు అలాంటి పాత్రే సునీల్‌ది. కానీ ఆ ఛాన్స్ సునీల్ మిస్ చేసుకోవడంతో ఆ లోటు సినిమాలో కనిపిస్తోంది. ఆ పాత్రలో సునీల్‌ని ఊహించుకుంటున్నారు సునీల్ అభిమానులు. ఆ పాత్రకు తగ్గట్టుగా తన ఎక్స్‌పీరియన్స్‌తో ఆలీ చాలా బాగా చేశాడు. కానీ అదే పాత్రలో సునీల్ కనిపించి ఉంటే, ఆ ఫీల్, అప్పియరెన్స్ ఇంకా పవర్ ఫుల్‌గా ఉండేదని భావిస్తున్నారు. అంతేకాదు ఆ పాత్రకి వెయిట్ మరింత పెరిగేదంటున్నారు. మొత్తానికి ఈ గోల్డెన్ ఛాన్స్‌ని సునీల్ మిస్ చేసుకోవడం అనేది దురదృష్టకరమే. ప్రస్తుతం హీరోగా పాపులరైన సునీల్, ఈ సినిమాలో కనిపించి ఉంటే తన కెరీర్‌కి ప్లస్ అయ్యేది. కానీ అలా జరగలేదు. అయితే మరోసారి అలాంటి ఛాన్స్ వస్తే మిస్ కానని సునీల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ సునీల్ మళ్లీ ఇలాంటి ఛాన్స్ దక్కించుకోవడం అంటే ఆలోచించాల్సిన విషయమే.