మహీరా మిస్సయ్యిందా?

మరిన్ని వార్తలు

షారూఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం 'రాయిస్‌'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు బిజీగా జరుగుతున్నాయి. ఇంతవరకూ రొమాంటిక్‌ లుక్స్‌తో అలరించిన షారూఖ్‌ ఖాన్‌ ఈ సినిమాలో న్యూ గెటప్‌తో కనిపిస్తున్నాడు. టిపికల్‌ మాస్‌ క్యారెక్టర్‌ లో నటిస్తున్నాడు షారూఖ్‌. నేర సామ్రాజ్యానికి డాన్‌గా 'రాయిస్‌'లో షారూఖ్‌ నటన ఆకట్టుకుంటుందంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌ నటిస్తోంది. పాకిస్థానీ నటుల్ని ఇండియాలో బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై గతంలో ఐశ్వర్యారాయ్‌ సినిమా చాలా వివాదాస్పదమైంది. అయితే ఆ వివాదం ఇప్పుడు కాస్త సద్దుమణిగింది. కానీ అనవసరంగా వివాదాలు లేవనెత్తుకోవడం ఇష్టం లేక ఈ సినిమా ప్రమోషన్స్‌కి మహీరాఖాన్‌ని ఆహ్మానించడం లేదట చిత్ర యూనిట్‌. అయితే షారూఖ్‌ మాత్రం ప్రమోషన్స్‌లో మహీరా పాల్గొంటుందని చెబుతున్నా, కానీ ఆమె హాజరు కావడం లేదని తెలుస్తోంది. కానీ మహీరాకు మాత్రం ఇండియన్‌ సినిమాలంటే చాలా ఇష్టమంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు చాలా ఆనందంగా ఉన్నా, సినిమా ప్రమోషన్స్‌లో తాను భాగం కాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందంటోంది బ్యూటీ మహీరా ఖాన్‌. గుజరాత్‌ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమిది. గుజరాత్‌ సంస్కృతీ సాంప్రదాయాల్ని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్‌. రాయిస్‌గా షారూఖ్‌ కాస్ట్యూమ్స్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS