తెలుగు చిత్రపరిశ్రమలోని ఇద్దరు బడా నిర్మాతలు అయిన దిల్ రాజు & అశ్వినీదత్ ల మధ్య కొన్ని విబేధాలు పెడచూపాయి అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీరిద్దరి మధ్య వచ్చిన వివాదానికి కారణం వారిరువురు కలిసి నిర్మించినబోతున్న మహేష్ 25వ సినిమానే అని అయితే తెలుస్తున్నది. సూపర్ స్టార్ మహేష్ బాబు సూచన మేరకు ఈ ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా #Mahesh25ని నిర్మించడానికి సిద్ధపడ్డారు.
ఇక ఇప్పుడు ఈ నిర్మాణం ఆ తరువాత లాభాల్లో వచ్చే వాటాల్లో లెక్కలు తేల్చుకునే అంశంలో ఈ ఇద్దరికీ అభిప్రాయ బేధాలు పొడచూపయాట! దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఇద్దరు పెద్ద నిర్మాతలు కావడం, ఎవరి బ్రాండ్ వేల్యూ వారికి ఉండటంతో లాభాల విషయంలో ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదే కారణం అని దాదాపుగా అందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెలలోనే మహేష్-వంశీ సినిమా ప్రారంభం కానున్న తరుణంలో ఇలాంటి ఒక పరిణామం ఈ సినిమా షూటింగ్ పైన ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. త్వరలోనే వీరివురు ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయానికి వస్తారు అని కోరుకుందాం...