సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి త్రిష. దాదాపు పదిహేనేళ్ళ నుండి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది.
ఇక తాజాగా ఆమె పైన ఐటీ అధికారులు ఒక కేసు వేయడం జరిగింది, ఆ కేసు ఏంటంటే- 2010-11 ఆర్ధిక సంవత్సరంలో ఆమె తన ఆదాయానికి సంబంధించి లెక్కలు చూపెట్టకుండా పన్ను ఎగవేసినట్టుగా ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు, దీనివల్ల ఆమె సుమారు రూ 1.16కోట్లు జరిమానాగా విధించారు.
దీనితో ఈ కేసు విషయమై త్రిష హైకోర్టుని ఆశ్రయించింది. కేసుని పూర్తిగా విచారించిన అనంతరం, ఆదాయపు పన్ను శాఖ వారు వేసిన కేసుని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో త్రిష & కో ఊపిరిపీల్చుకునట్టుగా సమాచారం.