పవన్ కళ్యాణ్ 25వ చిత్రం బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏరియాలకి సంబంధించి బిజినెస్ పరంగా పోటీ పడుతుండగా, ప్రముఖ దిల్ రాజు ఒక మంచి డీల్ కి తెరలేపాడు.
అదే ఈ చిత్రానికి సంబందించిన నైజాం ఏరియా రైట్స్ ని రూ 29కోట్ల మేర చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఇదొక రికార్డు డీల్ గా అందరు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నైజాం ఏరియాలో బాగా ఫాలోయింగ్ ఉండడం కూడా ఈ చిత్రం ఇంత ధర పలకడానికి కారణం అదే విధంగా దర్శకుడు త్రివిక్రమ్ అవ్వడం కూడా కలిసొచ్చే అంశం.
ఇక ఈ చిత్రానికి సంబందించిన ఓవర్సీస్ రైట్స్ సుమారు రూ 21కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. వచ్చే సంవత్సరం రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఇప్పుడే బిజినెస్ పూర్తికావడం విశేషం.