సినీ పరిశ్రమని తీవ్రంగా నష్టపరుస్తున్న పైరసీ పెనుభూతం పై తమిళ పోలీసులు విజయం సాదించారు అనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే, తమిళ రాకర్స్ పేరుతో ఒక సైట్ ని డెవెలప్ చేసి అందులో తమిళ చిత్రాలు రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే చిత్రాలను అప్లోడ్ చేస్తుండడం జరుగుతున్నది. ఇక దీని పైన దృష్టి పెట్టిన తమిళ పోలీసులు పక్కా ప్రణాళికతో ఆ సైట్ అడ్మిన్ ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్ట్ విషయాన్ని పోలీసులు కూడా ద్రువీకరించడం తో తమిళనాట చిత్రపరిశ్రమ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇది ఒక సైట్ మాత్రమేనని, ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే అదుపు చేస్తామని అక్కడి పోలీసులు చెబుతున్నారు.