ముద్దు సన్నివేశాలపై స్పందించిన దిల్‌రాజు.!

మరిన్ని వార్తలు

క్లీన్‌ మూవీస్‌కి ఇప్పుడంతగా ఆదరణ దక్కడం లేదు. సినిమా అంటే ముఖ్యంగా యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ అంటే అందులో ముద్దు సన్నివేశాలుండి తీరాల్సిందే. ఒక్కటి కాదు రెండు కాదు అంతకు మించి, అతి గాఢమైన ముద్దు సన్నివేశాలుంటే ఇంకేముంది ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టే. హిట్‌ కాకుంటే కుర్రకారు ఊరుకోవడం లేదు. 

అదే విషయమై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్పందించారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న 'హుషారు' సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిధిగా వెళ్లిన దిల్‌రాజు ఈ సినిమా కాన్సెప్ట్‌ నేపథ్యంలోనే ఈ విధంగా స్పందించడం జరిగింది. మంచిని ప్రొజెక్ట్‌ చేస్తూ సినిమాలు తీద్దామంటే కుదరడం లేదు. చెడుకే ప్రేక్షకులు ఎక్కువ ఎట్రాక్ట్‌ అవుతున్నారు. అలాగే లిప్‌లాక్స్‌ లేకపోతే ఆడియన్స్‌ ఆ సినిమాలను అస్సలు ఇష్టడడం లేదు. క్

లీన్‌ మూవీస్‌ తీసే నేను కూడా ముందు ముందు అలాంటి సినిమాలనే ఎంచుకోవాల్సి వస్తుందేమో అని దిల్‌ రాజు అన్నారు. 'అర్జున్‌రెడ్డి' మొదలుకొని, ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆర్‌ఎక్స్‌ 100' తదితర చిత్రాలు ఈ ముద్దు సీన్స్‌తోనే సూపర్‌ పాపులర్‌ చిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండించాయి. నిజమే చిన్న సినిమా అంటే అందులో లిప్‌లాక్‌ సీన్సే మెయన్‌ హిట్‌ ఫార్ములాస్‌గా మారిపోయాయి. 

ఇదే ఫార్ములాతో రూపొందిన ఇప్పుడు 'భైరవగీత', తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS