అలనాటి మేటి దర్శకుడు, నిర్మాత, నటుడు రాజ్ కపూర్ సతీమణి కృష్ణ రాజ్ కపూర్ ఈరోజు ఉదయం ముంబైలోని కపూర్ నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
పూర్తి వివారాల్లోకి వెళితే, 87 ఏళ్ళ కృష్ణ కపూర్ తమ అధికారిక నివాసం అయిన కపూర్స్ లో ఉంటున్నారు. అయితే గత ఏడాది వరకు ఆమెతో కలిసి మనవడు హీరో రణబీర్ కపూర్ ఉండేవాడు. ఈమధ్యనే ఆయన వేరే ఇంటికి మారినట్టుగా తెలుస్తున్నది.
ఇక రాజ్ కపూర్ భార్యగానే కాకుండా బాలీవుడ్ ప్రముఖులందరికి సుపరిచితురాలిగా ఆమెకి మంచి పేరు ఉంది. కృష్ణ రాజ్ కపూర్ మరణం హిందీ పరిశ్రమలోని చాలామంది ప్రముఖులని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.
కృష్ణ కపూర్ అంత్యక్రియలు ముంబై లోని చెంబూర్ లో జరపనున్నట్టు కపూర్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. దాదాపు భారతదేశ చలనచిత్ర రంగంలో మమేకమైన తొలి కుటుంబంగా కపూర్స్ కి పేరుంది. ఇక ఆ కుటుంబంలో ఒక ప్రముఖురాలు చనిపోవడం ఏదో తెలియని వెలితి అని పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.