దిల్ రాజు కాంపౌండ్ లోకి కరుణాకరన్

మరిన్ని వార్తలు

కరుణాకరన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' దర్శకుడు అంటే టక్కున గుర్తుపడతారు. పవన్ కెరియర్ లో టర్నింగ్ మూవీ తొలిప్రేమ. అప్పట్లో వంద రోజులు దాటి రన్ అయిన తొలిప్రేమ సినిమాకి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. క్లాసిక్ లవ్ స్టోరీ గా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అది. అలాంటి సూపర్ హిట్ తరవాత దర్శకుడు కరుణాకరన్  కెరియర్ పుంజుకోలేదు. పవన్ కి బ్రేకిచ్చిన కరుణాకరన్ మళ్ళీ తొలిప్రేమ లాంటి హిట్ అందుకోలేకపోయాడు.    


చాలా ఏళ్ళ గ్యాప్ తరవాత 2010లో ప్రభాస్ తో డార్లింగ్ మూవీ చేసాడు. డార్లింగ్ కూడా మొదట ఎవరికీ ఎక్కలేదు. కానీ తరవాత హిట్ టాక్ తెచ్చుకుని కరుణాకరన్ కి కొంత ఊరట నిచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా కలిసి రాలేదు. 2018 లో సాయి ధరమ్ తేజ్ తో 'తేజ్ ఐ లవ్ యు' చేశాడు. నెక్స్ట్ అదిగో ఇదిగో అన్న మాటలే కానీ ఇప్పటివరకు ఈ దర్శకుడి నుంచి ఇంకో సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇతని పేరు తెరపైకి వచ్చింది. కరుణాకరన్ కి  మంచి ఆఫర్ దొరికినట్టు సమాచారం. 


దిల్ రాజు ఏం చేసినా హిట్టే. అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. నిర్మాణ సంస్థలో రారాజుగా దూసుకుపోతున్న రాజుగారు, అన్న కొడుకుక్కి మాత్రం ఒక్క హిట్ అందించలేకపోతున్నారు. తమ వారసుడ్ని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశిష్ కోసం కరుణాకరన్ ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తెరమరుగున ఉన్న కరుణా కరణ్ దిల్ రాజు కాంపౌండ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ సినిమాతో అయినా కరుణా కరణ్ లక్ మారనుందా అన్నది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS