గత కొంతకాలంగా యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ పరంగా చాలా డౌన్ అయ్యాడనే చెప్పాలి. మరికొన్ని ఫ్లాపులు వస్తే మాత్రం ఆయన ఇమేజ్ ఇంకాస్త దెబ్బ తినేలా ఉంది.
ఇక ఈ తరుణంలో రాజ్ తరుణ్ తాజా చిత్రం లవర్ రేపు విడుదలకానుంది. అయితే ఈ చిత్రం పైన హీరోకి నిర్మాత దిల్ రాజు కి కాస్త గ్యాప్ ఏర్పడినట్టుగా వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ లో కూడా నిర్మాత కాస్త నిరాసక్తిగానే ఉన్నట్టుగా చెబుతున్నారు.
దీనికి ముఖ్య కారణంగా ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ అని తెలుస్తుంది, ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ కి ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడికి సమతుల్యం లేదని అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టెక్కడం కష్టం అని దిల్ రాజు భావన అని చెప్పుకుంటున్నారు.
ఇటువంటి సమయంలో విడుదలవుతున్న లవర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది రేపు తేలనుంది.