బిగ్ బాస్ సభ్యులకి, వీక్షకులకి షాక్ ఇచ్చిన ప్రదీప్

By iQlikMovies - July 19, 2018 - 12:40 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ హౌస్- ఈ ఇంటిలో ఏదైనా జరగోచ్చు... ఈ ట్యాగ్ లైన్ కి అచ్చంగా సరిపోయే విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

కొద్దినిమిషాల క్రితం బిగ్ బాస్ వారు విడుదల చేసిన టీజర్ లో ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం, అందులోని సభ్యులతో కలిసి సరదాగా గడుపుతుండడం, అదే సమయంలో ఆ టీజర్ లో ఇంటి సభ్యులకి వారి ఇంటి నుండి సమాచారం కూడా తెచ్చినట్టుగా మనకి అర్ధమవుతుంది.

ఇప్పటికే బిగ్ బాస్ పైన క్రేజ్ రోజురోజుకి పెరుగుతుండడం ఇక ఇప్పుడు ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడంతో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ సరికొత్త ఎట్రాక్షన్ వచ్చినట్టుగా అనుకోవచ్చు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా హెబ్బా పటేల్ వస్తుంది అన్న రూమర్స్ ఈ పరిణామంతో బ్రేక్ పడినట్టుగానే చెప్పొచ్చు.

ఇక ఇప్పటి నుండి బిగ్ బాస్ లో సందడి రెట్టింపు అవుతుంది అని కచ్చితంగా చెప్పొచ్చు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS