దిల్ రాజు బ్యానర్ నుంచి మరో సినిమా వచ్చింది. అదే.. `జానూ.` తమిళ 96కి ఇది రీమేక్. అక్కడ పనిచేసిన దర్శకుడితో పాటు, మిగిలిన సాంకేతిక నిపుణుల్నీ దిగుమతి చేశాడు. శర్వానంద్, సమంత తమ నటనతో ఈ కథకు ప్రాణం పోశారు. సినిమాపై రివ్యూలు కూడా అదిరిపోయేలా వచ్చాయి. అయితే సినిమా చాలా స్లోగా ఉందని, బోరింగ్ గా సాగిందని బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు చెబుతున్నారు. వాళ్లకు ఈ సినిమా అంతగా ఎక్కలేదు. ఇది కేవలం మల్టీప్లెక్స్ సినిమాగానే మిగిలిపోయింది. సినిమా కాస్త స్పీడుగా ఉండాలని, తమిళంలో తీసినట్టు స్లో నేరేషన్ చెల్లుబాటు కాదని దిల్ రాజు ముందు నుంచీ దర్శకుడికి చెబుతూనే ఉన్నాడట.
కనీసం పాటలైనా స్పీడుగా ఉండాలని సలహా ఇచ్చాడట. కానీ దర్శకుడు మాత్రం దిల్ రాజు సలహాల్నీ, సూచనలనీ అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఓ సందర్భంలో దిల్ రాజు కూడా `నేను చెప్పిన మాట దర్శకుడు వినలేదు` అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో.. తమిళ స్క్రీన్ ప్లేనే ఇక్కడా పాటించాల్సివచ్చింది. అందుకే సినిమా మరీ స్లోగా, కాస్త బోరింగ్ గా మారిపోయింది. దాంతో.. దిల్ రాజు ఈ దర్శకుడిపై అసంతృప్తితో ఉన్నాడని టాక్. ఈ సినిమాకి సంబంధించిన వేడుకలకు సైతం ప్రేమ్ కుమార్ దూరంగానే ఉంటూ వచ్చాడు. ఒక్క వేడుకకీ దర్శకుడు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని తెలుస్తోంది.