రామ్ చ‌ర‌ణ్‌తో స‌మంత‌?

మరిన్ని వార్తలు

రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ఇద్ద‌రూ సంద‌డి చేశారు. ఈ సినిమా విజ‌యంలో వీళ్ల కెమిస్ట్రీ కీల‌క పాత్ర పోషించింది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రినీ వెండి తెర‌పై చూసే అవ‌కాశం దక్కే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి `ఆచార్య‌` అనేపేరు ప‌రిశీలిస్తున్నారు. ఇందులో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్నారు.

 

చ‌ర‌ణ్ ఎపిసోడ్ దాదాపు 45 నిమిషాల పాటు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ స‌న్నివేశాల్లో చ‌ర‌ణ్‌కి జోడీగా స‌మంత క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. చిరంజీవి ప‌క్క‌న త్రిష‌ని ఇప్ప‌టికే క‌థానాయిక‌గా ఖ‌రారు చేశారు. ప్ర‌జెంట్‌లో త్రిష క‌నిపిస్తే... ఫ్లాష్ బ్యాక్‌లో ఆమెనే స‌మంత‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌న్న‌మాట‌. ఇది వ‌ర‌కు `గాయ‌త్రి`లో ఇలాంటి స్క్రీన్ ప్లేనే ఎంచుకున్నారు. అక్క‌డ మోహ‌న్ బాబు ఫ్లాష్ బ్యాక్‌లో మంచు విష్ణు క‌నిపిస్తారు. కానీ ఆ సినిమా వర్క‌వుట్ కాలేదు. మ‌రి ఈసారి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS