దిల్‌రాజు స్కెచ్చేస్తే సక్సెస్‌ చిక్కాల్సిందే.!

మరిన్ని వార్తలు

సినిమా సక్సెస్‌ని కరెక్ట్‌గా జడ్జ్‌ చేయడంలో దిల్‌రాజుకు సెపరేట్‌ సెన్స్‌ ఉందని చెప్పాలి. ఆయన రంగంలోకి దిగారంటే, ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉన్నట్లే. ఆయన చేయి పడిందంటే ఆ సినిమా హిట్‌ కొట్టాల్సిందే. తాజాగా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. 'శతమానం భవతి'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సతీష్‌ వేగేశ్న - దిల్‌రాజు కాంబినేషన్‌లోనే ఈ చిత్రం రూపొందింది.

 

మళ్లీ ఇప్పుడు 'శ్రీనివాస కళ్యాణం'తో వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అయ్యింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నితిన్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రోమోస్‌ ఆల్రెడీ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేశాయి. వెడ్డింగ్‌ గెటప్స్‌లో ఉన్న నితిన్‌, రాశీఖన్నా పోస్టర్స్‌ చాలా లైవ్‌గా రియిలిస్టిక్‌గా కనిపించేలా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసే యోచనలో దిల్‌ రాజు అండ్‌ టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి దిల్‌రాజు పక్కా ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

 

సినిమాని జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో దిల్‌ రాజు ఉన్నాడట. ఎందుకో తెలుసా? ఈ డేట్‌కి ఓ స్పెషాలిటీ ఉంది మరి. 2017 జూన్‌ 21న 'ఫిదా' విడుదలైంది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్‌ దిల్‌రాజే. అంతవరకూ ఫెయిల్యూర్స్‌లో ఉన్న డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములకు ఈ సినిమా ఏ స్థాయిలో బ్రేక్‌ ఇచ్చిందో తెలుసు కదా. ఇక బాక్సాఫీస్‌కైతే కాసుల సునామీనే. అందుకే దిల్‌రాజు 'శ్రీనివాస కళ్యాణం' సినిమాని ఈ ఏడాది అదే డేట్‌కి రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాడట. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌కి ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. అలా దిల్‌రాజు స్కెచ్చేశాడు మరి. హిట్‌ కొట్టి తీరాల్సిందే కదా. చూడాలిక ఏం జరుగుతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS