తెలుగులో 'మనసుకు నచ్చింది' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ త్వరలోనే 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో తొలి సినిమా 'మనసుకు నచ్చింది'. నటన పరంగా, గ్లామర్ పరంగా అమ్మడు ఓకే అనిపించినా, ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ని అందించడంలో ఫెయిలైంది. సెకండ్ మూవీగా రాజ్‌తరుణ్‌తో జత కడుతోంది. ఆల్రెడీ ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమాలో నటించింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా వచ్చిన 'అనేగన్' చిత్రంలో అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రంలో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఈ బ్యూటీ చాలా బాగా నటించింది. అందానికి అందం, అందానికి తగ్గ అభినయంతో ఆకట్టుకుంది. తెలుగులో ఇంకా బ్రేక్ రాలేదు కానీ, ఈ బ్యూటీకి లేటెస్టుగా బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అప్పుడెప్పుడో తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'ప్రస్థానం' సినిమా గుర్తుంది కదా.
సాయి కుమార్ కీలకపాత్ర పోషించాడీ సినిమాలో. ఆ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారట. ఒరిజినల్‌ని తెరకెక్కించిన తెలుగు డైరెక్టర్ దేవా కట్టా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమైరాని ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాలో సాయి కుమార్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్ పోషిస్తున్నాడు. సంజయ్‌దత్ సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న క్యూట్ బ్యూటీ అమైరా దస్తూర్, ఆల్రెడీ ఇంటర్నేషనల్ మూవీ 'కుంగ్‌ఫూ యోగా'లో జాకీచాన్‌తో కలిసి నటించేసింది.