ఈ సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర సందడి మామూలుగా లేదు. ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. దిల్ రాజు `వారసుడు` సంక్రాంతికే వస్తోంది. ఈనెల 12న బాలకృష్ణ వీర సింహారెడ్డితో పాటుగా వారసుడు విడుదల చేయాలని దిల్ రాజు భావించాడు. కానీ చివరి నిమిషంలో ఆలోచన మారింది. 11నే వారసుడు తీసుకురావాలని నిర్ణయించుకొన్నారు. నిజానికి ఇది చాలా తెలివైన నిర్ణయం. 12న బాలయ్య సినిమా హడావుడి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఎవరికైనా సరే.. బాలయ్య సినిమానే. కాబట్టి... వారసుడుపై ఎవరికీ ఫోకస్ ఉండదు. ఆ మరుసటి రోజు... చిరంజీవి సినిమా వస్తుంది. 13న కూడా వారసుడు సినిమా ఆడుతున్న థియేటర్లు ఫుల్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే వారసుడు సినిమా బాగున్నా.. దానిపై జనాల దృష్టి పడాలంటే 14 వరకూ ఆగాలి. ఈలోగా.. సినిమాపై టాక్ స్పైడ్ అయిపోతుంది. సో... ఆ ప్రభావం వారసుడు వసూళ్లపై తీవ్రంగా పడుతుంది.
అందుకే.. ఒక రోజు ముందుకు తీసుకొస్తే.. ప్రేక్షకుల తొలి ఛాయిస్ కూడా వారసుడు నే అవుతుంది. 11న వారసుడు, 12న బాలయ్య సినిమా, 13న చిరు సినిమా.. ఇలా.... ఒక్కో రోజు ఒక్కో సినిమాకి కేటాయించుకోవొచ్చు. పైగా వారసుడు సినిమాకి కావల్సినన్ని థియేటర్లు దొరుకుతాయి. టాక్ బాగుంటే.. బాలయ్య, చిరు సినిమాలు వచ్చినా సరే... వసూళ్ల హడావుడి తగ్గదు. అందుకే ఒక రోజు ముందే.. దిల్ రాజు సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకొన్నారు.