ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ప్రచురించిన ఓ ప్రత్యేక కథనం ఆసక్తికరంగా వుంది. ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్ పేరు, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ‘ఆస్కార్’కు నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్ అభిప్రాయపడింది. కొందరు ప్రముఖ హాలీవుడ్ నటులతో వున్న ఈ జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి పేర్లు వుండటం హాట్ టాపిక్ గ మారింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ఈ ఏడాది జరగనున్న అకాడమీ అవార్డుల్లో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ దరఖాస్తు చేసుకుంది. ఈ చిత్రం నుంచి నాటునాటు పాట ఆస్కార్ ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగం షార్ట్‌లిస్ట్‌లోచోటు దక్కించుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి పేర్లు కూడా ఆస్కార్ బరిలో వినిపించడం ఆసక్తికరంగా మారింది.