పరిశ్రమలో పాతికేళ్లుగా పంపిణీదారుడు కమ్ నిర్మాతగా కొనసాగుతున్నాడు దిల్ రాజు. తెలుగు ఇండ్రస్ట్రీలో ఇప్పుడాయన ఓ టాప్ ప్రొడ్యూసర్. ఆయన పట్టిందల్లా బంగారమే అని పేరు. అలాంటి దిల్ రాజు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సీజన్‌లో సినిమాలేవీ కొనకూడదని, పంపిణీ చేయకూడదని నిర్ణయించుకున్నార్ట. నైజాం అంటే దిల్ రాజుదే. పెద్ద సినిమా పేరు చెబితే - నైజాం షేర్ దిల్ రాజు దగ్గరే ఉంటుంది. ఆయన కాదన్న తరవాతే.. మరొకరి దగ్గరకు వెళ్తుంది. అలాంటి దిల్ రాజు.. సినిమాలను కొనకూడదని తీర్మాణించుకున్నారంటే ఇండ్రస్ట్రీకి షాకే. ప్రస్తుతం చిత్రసీమ సంక్షోభంలో ఉంది.
కరోనా ఎఫెక్ట్ ఎప్పటికి తగ్గుతుందో తెలీదు. సినిమాలన్నీ రిస్కులో ఉన్నట్టే. అలాంటప్పుడు బిజినెస్ కి దూరంగా ఉండడం శ్రేయస్కరం. పైగా దిల్ రాజు ప్రొడక్షన్‌లో పెద్ద సినిమాలు తయారవుతున్నాయి. బాలీవుడ్ కీ వెళ్లే ఆలోచన వుంది. అందుకే... కొంతకాలం సినిమాల్ని కొనకూడదని భావిస్తున్నార్ట. అంతగా అవసరం అయితే.. కమీషన్ బేసెస్ మీద సినిమాల్ని విడుదల చేస్తార్ట. దిల్ రాజు లాంటి వాళ్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. మిగిలిన పంపిణీదారుల మాటేంటో?