అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సైరా' పాజిటివ్ టాక్‌తో తొలి రోజులోనే మంచి వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో షేర్లు గురించి అస్సలు మాట్లాడుకోరు. అక్కడ ఓన్లీ గ్రాస్ గురించే మాట్లాడుకుంటారు.. అని ఎత్తి, 'సైరా' ఓవరాల్ గ్రాస్ 85 కోట్లు అని ఆయన తేల్చేశారు. ఈ లెక్క కేవలం ఒక్క రోజుదే. ఇంకా అసలు సిసలు వసూళ్ల పండగ ముందుంది.
వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ గ్రాస్ ఏ స్థాయిని అందుకుంటుందో ఊహించలేమని అన్నారాయన. అయినా, చిరంజీవి చూడని సక్సెస్ కాదిది. చిరంజీవి చూడని డబ్బులు కావివి అంటూ, చిరంజీవి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. 'సైరా'ని ఈ స్థాయిలో ఆదరించినందుకు 'సైరా' యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ నేపథ్యంలోనే దిల్‌రాజు ఇలా తన మనసులోని మాటల్ని పంచుకుని, చిరంజీవి పట్ల తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు.
డైరెక్టర్‌గా సురేందర్‌రెడ్డిని ప్రశంసించారాయన. ఓ నిర్మాతగా చరణ్ పడిన కష్టమేంటో తనకు తెలుసన్నారు. అలాగే చరణ్ కూడా నిర్మాతల స్థానంలో ఉంటే ఇలాగే ఉంటుందేమో అని ఇన్ని రోజులుగా తాననుభవించిన టెన్షన్‌ని సభా ముఖంగా అందరి ముందుంచాడు. చరణ్ 'సైరా'తో చిరంజీవికి గిఫ్ట్ ఇస్తే, 'సైరా' సక్సెస్‌తో చిరంజీవి, చరణ్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు.. అని జగపతిబాబు వ్యాఖ్యానించారు.