ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన త్వరలోనే పెళ్లి కొడుకు అవతారంతో కనిపించబోతున్నారా? - ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. దిల్ రాజు వయసు యాభై దాటేసింది. ఆయనకు మనవడు కూడాఉన్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య కన్నుమూశారు. భార్య లేని లోటు ఆయన జీవితంలో ఎవరూ తీర్చలేనిది. నిర్మాతగా వరుస విజయాలు, భారీ ప్రాజెక్టులూ చేతిలో ఉన్నా, వ్యక్తిగతంగా ఒంటరే. అందుకే ఇప్పుడు జీవితంలోనూ స్థిరపడాలని భావిస్తున్నారు.
ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు ముహూర్తం కూడా ఖరారైందని, ఈసారి మాత్రం పెళ్లి ఎలాంటి హడావుడీ లేకుండా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. దిల్ రాజుని మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పింది ఇంట్లోవాళ్లే అని, వాళ్ల కోసమే దిల్ రాజు మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.