సుప్రసిద్ధ నటుడిగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన దిలీప్ కుమార్ ఇప్పుడు ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
తెలుస్తున్న వివరాల ప్రకారం, డీ-హైడ్రేషన్ సమస్యతో దిలీప్ కుమార్ ని ఆయన కుటుంబసభ్యులు బుధవారంనాడు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి.
ఇక ఆయన రెండు కిడ్నీలు బాగా దెబ్బతినట్టు తెలుస్తున్నది. ఆయన భార్య, నటి అయిన సైరాబాను మీడియాతో మాట్లాడుతూ- ఆయన ఆరోగ్యంమెరుగుపడాలని అందరు దేవుడిని ప్రార్దించండి అని విజ్ఞప్తి చేసింది.