హీరోగా మారనున్న దర్శకుడు

మరిన్ని వార్తలు

సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న గొప్పతనమేంటి అంటే ఇక్కడ అందరు హీరోలే. హీరోగా ఎవరు నటించినా అంతా ఆదరిస్తారు. ఈ క్రమంలోనే విలన్లు, కమెడియన్లు, సింగర్స్, దర్శకులు, కొరియోగ్రాఫర్స్, నిర్మాతల పిల్లలు అందరు హీరోలుగా మారుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మరో దర్శకుడు హీరోగా మారబోతున్నాడు. అపజయం ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావి పూడి. మొదటి సినిమా 'పటాస్' నుంచి తెరవెనక హీరోగా  సక్సెస్ ఫుల్ జర్నీ చేసాడు. F2, F3, భగవంత్ కేసరి ఇలా ఏ ప్రాజెక్ట్ చేసినా అది పక్కా హిట్. ప్రజంట్  వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.


వెంకటేష్ తో చేయబోయే సినిమా కంప్లీట్ చేసి నటుడిగా మారనున్నాడని టాక్. హా ఎదో  సహాయక పాత్ర అనుకున్నారా? కాదు హీరోగానే ఎంట్రీ ఇవ్వనున్నాడు. తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్ ని, తన స్టైల్ ని స్క్రీన్ మీద చూపించి, తాను కూడా  హీరో మెటీరియల్ అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నాడట. అనిల్ లో మంచి యాక్టర్ ఉన్న సంగతి కొన్ని ఈవెంట్లలో బయటపడింది. హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం  చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ మూవీలో అనిల్ రావి పూడి కేవలం హీరో మాత్రమే అని, దర్శకుడు వేరేవాళ్లని సమాచారం. 


ఇప్పటివరకు కెప్టెన్ గా వ్యవహరించిన అనిల్ రావి పూడి ఇప్పుడు కెప్టెన్ చెప్పు చేతల్లో ఉండటానికి రెడీ అవుతున్నాడు. ఇందుకోసమే అనిల్ వర్క్ అవుట్స్ చేస్తూ స్లిమ్ అయ్యాడంట. వెంకటేష్ సినిమా కంప్లీట్ చేసి, కొత్త జర్నీ మొదలుపెట్టనున్నాడు. అనిల్ పక్కన నటించే  హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS