నటితో అసభ్యంగా ప్రవర్తించిన నేరం క్రింద ఒక దర్శకుడు కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే, ఒక సినిమా షూటింగ్ కోసం విజయవాడ వేలదమంటూ ఒక వార్థమాన నటిని ఆ చిత్రానికి సంబందించిన హీరో సృజన, దర్శకుడు చలపతి కారులో తీసుకెళ్ళారు.
అయితే విజయవాడకి సమీపంలోకి వచ్చేశాక, దర్శకుడు ఆ సదరు నటిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా వెనక సీటులోకి నెట్టేసే క్రమంలో ఆయన నడుపుతున్న వాహనం అదుపుతప్పి ఒక లారీని డీకొంది.
ఇందులో గాయపడిన తరువాత ఒక ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకొని, ఆమెని నిర్మాత ఇంటికి తీసుకువెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని ఆమె మాట వినకుండా ఆ ప్రదేశం నుండి తప్పించుకుని వచ్చి పతమతలోని పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదుని స్వీకరించి, కేసు నమోదు చేసి సృజన, చలపతి లని అరెస్ట్ చేశారు.