మెగాస్టార్ కోసం స్క్రిప్టు రెడీ

మరిన్ని వార్తలు

బాబీ ల‌క్కు మామూలుగా లేదు. ద‌ర్శ‌కుడి త‌క్కువ సినిమాలు చేసినా, పెద్ద పెద్ద స్టార్ల‌తో ప‌నిచేసే ఛాన్సు కొట్టేశాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నాడు. `ద‌ర్శ‌కుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నాన‌`ని ఇది వ‌ర‌కు చిరంజీవి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈలోగా... బాబీ క‌థ చిరంజీవికి క‌థ చెప్ప‌డం, చిరు ఓకే అనేయ‌డం జ‌రిగిపోయాయి. ఇప్పుడు స్క్రిప్టు ప‌నులు కూడా పూర్తి చేసేశాడ‌ట బాబి.

 

`ఇది వ‌ర‌కే చిరంజీవి గారికి ఓ క‌థ చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చింది. స్క్రిప్టు ప‌నులు కూడా పూర్తయ్యాయి. టైమ్ ఉంది క‌దా అని ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాను`` అని చెప్పుకొచ్చాడు బాబీ. తాను చిరంజీవికి వీరాభిమానిన‌ని, చిరు అభిమానుల‌కు ఏం కావాలో అంద‌రికంటే త‌న‌కు బాగా తెలుస‌ని, అభిమానులంతా గ‌ర్వ‌ప‌డే సినిమా తీస్తాను' అంటున్నాడు బాబి. అంతే కాదు... ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం కూడా ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ట బాబి. అన్నీ కుదిరితే... ఈ రెండు సినిమాల్నీ బ్యాక్ టూ బ్యాక్ చేసేసే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS