మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన యంగ్‌ డైరెక్టర్‌!

మరిన్ని వార్తలు

యంగ్‌ డైరెక్టర్‌ బాబీ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ చిక్కిందనే ప్రచారం సాగుతోంది. విచిత్రంగా ఈ డైరెక్టర్‌ ఇంతవరకూ స్టార్‌ హీరోలతోనే సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్నాడు. సాలిడ్‌ హిట్స్‌ అని అనలేం కానీ, అందరూ స్టార్‌ హీరోలే కావడం విశేషం. తాజాగా మరో స్టార్‌ హీరో బాబీ చేతికి డైరెక్షన్‌ పగ్గాలు ఇచ్చాడనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. బాబీ రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి ఓ స్టోరీ లైన్‌ చెప్పాడట. ఆ స్టోరీ లైన్‌ అల్లు అర్జున్‌కి బాగా నచ్చేసిందట. డెవలప్‌ చేయమని సూచించాడట. ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో..' సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. తర్వాత సుకుమార్‌ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. తాజా ప్రచారాన్ని బట్టి ఈ లోగానే ఇంకో క్రేజీ ప్రాజెక్ట్‌ని బన్నీ లైన్‌లో పెట్టేశాడన్న మాట. ఈ సినిమా సొంత బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో రూపొందనుందనీ సమాచారం. మరోవైపు అల్లు అర్జున్‌, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌ - కనబడుటలేదు' చిత్రంలో నటించాల్సి ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ముందుగా పట్టాలెక్కిస్తాడో చూడాలిక. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బాబీ 'వెంకీ మామ' సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ, చైతూ కాంబినేషన్‌లో మల్లీ స్టారర్‌ మూవీగా వచ్చిన ఈ సినిమా పోజిటివ్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS