వాల్తేరు వీరయ్య సినిమాతో ఓ సూపర్ హిట్టు కొట్టి 2023ని ఘనంగా ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన చేతుల్లో `భోళా శంకర్` మాత్రమే ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మరి మెగాస్టార్ తరువాతి సినిమా ఎప్పుడు? ఎవరితో? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
భోళా శంకర్ తరవాత... వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేస్తాడని చెప్పుకొన్నారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. మారుతి కూడా చిరుకి ఓ కథ చెప్పి ఒప్పించాడు. కానీ ఇప్పుడు తను ప్రభాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే చిరు చేతుల్లో కొత్త సినిమాలేం లేకుండా పోయాయి. అయితే.. రచయిత బీవీఎస్ రవి చిరుకి ఓ కథ చెప్పాడట. అది చిరుకి బాగా నచ్చిందని సమాచారం. అయితే.. ఆ కథని డీల్ చేసే దర్శకుడు చిరుకి కావాలి. ఆ కథని ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందా? చిరు చిరు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా చిరుతో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. రవి కథని పూరి డీల్ చేస్తానంటే ఓకే.. లేదంటే... చిరు మరో దర్శకుడ్నిచూసుకోవాల్సిందే.