విడాకులు తీసుకుంటున్న దర్శకుడు క్రిష్

By iQlikMovies - May 31, 2018 - 21:07 PM IST

మరిన్ని వార్తలు

అవును.. మీరు చదువుతున్నది నిజమే.. ప్రముఖ దర్శకుడు క్రిష్ తన భార్య రమ్య వెలగ నుండి విడాకులు తీసుకోనున్నాడు.

అందుతున్న వివరాల ప్రకారం, క్రిష్-రమ్య లు ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చారట. సాధారణంగా ఇరువురి అంగీకారంతో కోర్టులో విడాకులకి అర్జీ పెట్టుకుంటే, ఆరు నెలల సమయం ఇచ్చాక విడాకులు మంజూరు చేస్తుంది న్యాయస్థానం.

అయితే ఈ విడాకుల వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 2016లో వీరి వివాహం జరగగా, రెండేళ్ళు కూడా పూర్తికాకముందే విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఈ అంశం పై దర్శకుడు క్రిష్ ఇంకా స్పందించలేదు. 

ప్రస్తుతం క్రిష్ హిందీలో మణికర్ణిక చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ అలాగే ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ-ప్రొడక్షన్ పనులలో తలమునకలై ఉన్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS