ఈరోజు ఉదయం జూబిలీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసే ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త ఇప్పుడు కలకలం రేపుతున్నది.
ఆ వివరాల్లోకి వెళితే, ఏ నారాయణ రెడ్డి (53) అనే వ్యక్తి గత కొంతకాలంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసేవాడని, అయితే నేటి ఉదయం ఆయన స్టూడియోస్ లో చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఇక నారాయణ రెడ్డి మృతదేహాన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని సమాచారం.
అయితే ఆయన ఇలా అకస్మాత్తుగా మృతి చెందడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లేక సహజ మరణమేనా అంటూ పలువురు సందేహాలు వ్యక్త చేశారట. ఇక మృతుని బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని నిజానిజాలు తెలియచేయాలని ఆందోళన కి దిగినట్టు తెలుస్తున్నది.
అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.