మారుతి సినిమాలంటే హీరోకి ఏదో డిఫెక్ట్ ఉండే ఉంటుందన్న మాట.. అని ఫిక్సయిపోయారు ఆడియన్స్. కానీ, ఈ సారి మారుతి తెరకెక్కిస్తున్న 'ప్రతిరోజూ పండగే'లో ట్రాక్ మార్చేశాడు. హీరోపై ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ, హీరోయిన్‌కి డిఫెక్ట్ పెట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రాశీఖన్నా ఏంజిలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఏంజిలాకి టిక్‌టాక్ వీడియోలు చేయడమంటే ఇష్టం. ఇష్టం అనే కన్నా పిచ్చి అనాలేమో. ఇకనేం, ఈ రోజుల్లో ఇంతకన్నా పెద్ద డిఫెక్ట్ ఇంకేముంటుంది.
టిక్ టాక్ మాయలో పడి, అమ్మాయిలు, అబ్బాయిలు, ఆ మాటికొస్తే, అంకుల్స్, ఆంటీస్, పిల్లలు, పెద్దోళ్లు ఒక్కరేమిటి.. నో ఏజ్ లిమిట్స్, ఈ పిచ్చ పరాకాష్టకు చేరి, ఎలా ఇబ్బందుల్లో పడుతున్నారో ప్రతీ రోజూ బొచ్చెడు వార్తలు వింటున్నాం. మరి అలాంటప్పుడు దీన్ని డిఫెక్ట్గానే పరిగణించాలి కదా. ఈ సినిమాలో హీరోయిన్ రాశీఖన్నా పాత్ర కూడా అలాంటిదే మరి, టిక్ టాక్ వీడియోలు చేసే ఈ అమ్మాయి దాని కారణంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందా.? అంటే ఇప్పటికైతే చెప్పలేం కానీ, సినిమా విడుదలైతే తెలుస్తుంది. అన్నట్లు ఈ సినిమాతో తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది రాశీఖన్నా.
ఇకపోతే, సినిమా కథ గురించి డైరెక్టర్ మారుతి చాలా గొప్పగా చెబుతున్నారు. ఇంతవరకూ తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ఇలాంటి కథను ఎవ్వరూ వాడి ఉండరు అని ధీమాగా చెబుతున్నాడంటే, స్టోరీ చాలా బలమైందని భావించాలి. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇదో మంచి సినిమా అవుతుందని అంటున్నారు. చూడాలి మరి, కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిశంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.