బిగ్‌బాస్ సీజన్ 3లో వన్ ఆఫ్ ది గ్లామర్ అండ్ క్రేజీయెస్ట్ కంటెస్ట్ అయిన పునర్నవి భూపాళంకు పర్సనల్‌గా ఓ లవ్‌స్టోరీ ఉందని హౌస్‌లో ఉన్నప్పుడే ఓ సందర్భంలో తెలిసింది. రాహుల్ - పునర్నవి మధ్య లవ్ ట్రాక్ మాంచి ఊపు మీద ఉన్నప్పుడే ఈ విషయం తెలిసింది. కానీ, వీరిద్దరి లవ్ ట్రాక్ ముందు ఆ ఇష్యూ అంతగా హైలైట్ కాలేదు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పునర్నవి తన లవ్ స్టోరీ చెప్పింది. తనకు ఓ లవర్ ఉన్నాడట. వీరిద్దరూ గతంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే, కెరీర్ పరంగా చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ వచ్చి వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చిందట.
కెరీర్‌లో భాగంగా పునర్నవి యూఎస్ వెళ్లాల్సి వచ్చిందట. అప్పుడు తన లవర్ శ్రీలంకలో ఉన్నాడట. అయితే, దురదృష్టవశాత్తూ, మొన్నామధ్య జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్‌లో పునర్నవి లవర్ చనిపోయాడన్న వార్త తెలిసిందట. దాంతో కొన్నాళ్లు పునర్నవి డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయిందట. ఆ తర్వాత కొంతకాలానికి కెరీర్‌లో బిజీ కావడం, బిగ్‌బాస్ నుండి పిలుపు రావడం.. వంటి మార్పులు వేగంగా జరిగిపోయాయనీ, చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఓర్చి ఈ స్టేజ్‌కి వచ్చానని పునర్నవి చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం పునర్నవి హీరోయిన్‌గా రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో 'సైకిల్' అనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో, ఆడియన్స్‌కి ఓ మోస్తరుగా కనెక్ట్ అయ్యింది. వీటితో పాటు, మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని పునర్నవి చెప్పుకొచ్చింది.