ప్రముఖ హిందీ దర్శకుడు నీరజ్ వోహ్రా (54) ఇక లేరు.
అందుతున్న వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 4 గంటలకు ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందాడు. గత సంవత్సరం నీరజ్ కి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనని ఢిల్లీలోని AIIMSలో జాయిన్ చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళకి అక్కడి డాక్టర్లు ఇక కష్టం అని చెప్పడంతో నిర్మాత ఫిరోజ్ తనని ఢిల్లీ నుండి ముంబై తీసుకువచ్చి తన ఇంటిలో ఉంచి మరి చికిత్స చేయించారు.
క్రమక్రమంగా మెరుగు పడుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా గత శుక్రవారం దెబ్బతినడంతో ఆయనని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. డాక్టర్లు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమై ఆయన తుది శ్వాస విడిచారు.
ఈయన హిందీ చిత్ర పరిశ్రమలో రైటర్ గా మొదలై ఆర్జీవీ సినిమాలకి రైటర్ గా పనిచేశారు. తరువాతి కాలంలో దర్శకుడిగా మారి ఫిర్ హేరా ఫేరీ, చాచి 420 చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఈయన అకాల మృతికి ప్రధాన మంత్రి సహా బాలీవుడ్ నటులంతా తీవ్ర దిగ్బ్రాంతి, సంతాపం తెలియచేశారు.
నీరజ్ మృతికి మా www.iQlikmovies.com తరపున ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.