చిరు 153కి ఆ డైరెక్టర్‌ ఫిక్సయ్యాడా.?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవితో ‘ఠాగూర్‌’ చిత్రం తెరకెక్కించి రికార్డు హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ వినాయక్‌. అయితే, ‘అఖిల్‌’ సినిమాతో దారుణమైన డిజాస్టర్‌ చవి చూడాల్సి వచ్చింది. అలాంటిది మళ్లీ మెగాస్టార్‌ చిరంజీవి చలవతో డైరెక్టర్‌గా పుంజుకున్నాడు వినాయక్‌. మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీకి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పే సదవకాశాన్ని పొందడం, ‘ఖైదీ నెంబర్‌ 150’తో మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం చకా చకా జరిగిపోయాయి. ఐనా వినాయక్‌కి డైరెక్టర్గా అవకాశాలు కరువయ్యాయి. ఈలోగా దిల్‌ రాజు ప్రోత్సాహంతో ‘శీనయ్య’ అంటూ హీరో అవతారమెత్తేశాడు వినాయక్‌.

 

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఎందుకో ‘శీనయ్య’ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే ప్రచారం ఇటీవల కొత్తగా తెరపైకి వచ్చింది. ఈ ప్రచారం ఇలా ఉండగా, మళ్లీ మెగాస్టార్‌ చిరంజీవి రూపంలో వినాయక్‌కి జాక్‌పాట్‌ తగిలినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ 153ని తెరకెక్కించే అదృష్టం వినాయక్‌కి దక్కిందని మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకూ జస్ట్‌ గాలి వార్తగానే వినబడిన ఈ వార్తకు ఇప్పుడు అగ్నికి ఆధ్యం తోడైనట్లు బలం చేకూరుతోంది. మలయాళ రీమేక్‌ లూసిఫర్‌’లో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాకి నిర్మాత అయిన రామ్‌చరణ్‌, డైరెక్టర్‌గా వినాయక్‌ పేరు పరిశీలిస్తున్నారట. దాదాపు వినాయక్‌ ఫిక్స్‌ అయ్యాడనీ సినీ వర్గాల్లో టాక్‌. ఈ టాక్‌ నిజమే అయితే, మళ్లీ వినాయక్‌ దశ తిరిగినట్లే. ఇకపోతే, ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే, ‘లూసిఫర్‌’ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS