కన్నడ స్టార్‌ కోసం టాలీవుడ్‌ దర్శక ధీరుడు.!

By iQlikMovies - December 06, 2018 - 18:19 PM IST

మరిన్ని వార్తలు

చిన్న సినిమాల్ని ఎంకరేజ్‌ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఆలోచించకుండా, సినిమా నచ్చితే వెంటనే తనదైన శైలిలో ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించడం రాజమౌళి ప్రత్యేకత. అలాగే ఇప్పుడు ఆయన ఆశీర్వాదాలు కన్నడ మూవీ 'కెజీఎఫ్‌'కి దక్కాయి. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఈ నెల 9న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఆ ఈవెంట్‌కి టాలీవుడ్‌ తరపున దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. కన్నడ నటుడు యష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. ప్రముఖ బ్యానర్‌ వారాహి బ్యానర్‌లో సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. కన్నడ సినిమా అయినప్పటికీ, తెలుగు, హిందీలో కూడా ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది ఈ ట్రైలర్‌. కాగా ఈ సినిమాకి మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్‌ సాంగ్‌ మెయిన్‌ అట్రాక్షన్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS