2.O Film
కబాలి, కాలా ఫ్లాపులతో సతమతమవుతున్న రజనీకాంత్ ఫ్యాన్స్‌కి `2.O సినిమా` రూపంలో విందు భోజనమే అందించాడు శంకర్. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని, శంకర్ సృజనాత్మకతకు ఇది నిదర్శనమని అంతా కొనియాడుతున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం శంకర్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు.
అదేంటంటే.. ఈ సినిమాలో పాటలు లేకుండా చేశాడు శంకర్. ఉన్న ఒక్క పాటనీ ఎండ్ టైటిల్స్‌లో వేశాడు. సినిమా అయిపోయిన మూడ్ వచ్చేస్తే... ఏ ప్రేక్షకుడూ థియేటర్లో కూర్చోలేడు. అలాంటప్పుడు ఎండ్ కార్డ్స్‌లో పాట వేయడం వల్ల ఉపయోగం లేదు. అప్పటికే సగం థియేటర్లు ఖాళీ అవుతున్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా చివర్లో ఓ చిన్న సీన్ కూడా ఉంచాడు శంకర్. చిన్ని3.0 సినిమా కి అది ఓ సూచనలా అనిపించింది. ఆ సీన్ కూడా చాలా మంది మిస్ అయిపోతున్నారు. అన్ని కోట్ల ఖర్చు పెట్టి తెరకెక్కించిన పాటని చివర్లో వేయడం ఏమిటన్నది చాలామందికి మింగుడుపడని విషయం. ఒకవేళ పాట మధ్యలో ఎక్కడ ఇరికించినా, కథ ఫ్లో దెబ్బతినేది. అందుకే శంకర్ భయపడి ఉంటాడు. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి పాట తీయడం ఎందుకో..??